తోకచుక్క రాకతో తటస్థించే దుష్ప్రభావాలు
బుధవారం, 12 సెప్టెంబర్ 2007(
17:51 IST )
తోకచుక్క దుష్ప్రభావానికి ప్రధాన కారణంగా శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. ఇందుకు ఓ ప్రధాన ఉదాహరణ చూద్దాం. కురుక్షేత్ర సంగ్రామానికి ముందు ఈ తోకచుక్క కనిపించింది. దీని ఫలితంగానే శ్రీకృష్ణుడు చేసిన సంధి ఫలించక నాటి యుద్ధంలో లక్షల మంది సైనికులు హతమైపోయారు. చరిత్రను పరిశీలిస్తే, క్రీ.పూ 1193లో ధూమకేతువు రాక వలన ఈజిప్టు రాజు మరణం జరిగింది. అప్పట్లో ఈజిప్టు దేశం నాగరికతలో విరాజిల్లుతూండేది. ఇదే విధంగా ధూమకేతువు ఆగమనం వల్ల అరిస్టాటిల్, గ్రీకువీరుడు అలెగ్జాండర్, సీజర్ వంటి మహామహులు మరణించారు.
తోకచుక్క కనపడిన మార్గంలో, దాని తోక ఆధారంగా ఎన్ని డిగ్రీలపై అక్షాంశరేఖపై పడిందో, అన్ని డిగ్రీల కోణంలో ఉన్న భూ భాగాల్లో ఆకస్మిక విషాద సంఘటనలు జరుగుతాయి. ఆ ప్రాంతాల్లో ప్రముఖుల మరణం లేదా యుద్దం లేదా ప్రకృతి వినాశనం జరుగుతాయి. కాల ప్రారంభంనుంచి ఈ తోకచుక్క కన్పిస్తూనే ఉంది. తోకచుక్క భూమికి దగ్గరగా వచ్చిన సందర్భాల్లో యుగపురుషులు తమ దేహాలను విడిచిపెట్టారు. ఆయా ప్రాంతాల్లో భీకర యుద్ధాలు జరిగాయి. దీని రాకతో యుగాలు సైతం అంతమైపోయాయి.
భవిష్యత్తు గురించి తెలియజెప్పే శాస్త్రాలు మనకు ఎన్నో ఉన్నాయి. జ్యోతిష్యం, సంఖ్యా శాస్త్రం, వాస్తు ఇలా.... అయితే ఇవన్నీ భవిష్యత్తు గురించి ఇచ్చే వివరాలు ఏ మేరకు సరిగ్గా ఉంటాయనేది ఎన్నో ఆయా వ్యక్తుల జన్మదినం, సమయం, తిథి, నక్షత్రాలు, సూర్యోదయాస్తమయాలపై ఆధారపడి ఉంటాయి. అయితే ఇప్పుడు మనం తోకచుక్కగా పిలిచే ధూమకేతువు కనబడితే మాత్రం అతి సమీప భవిష్యత్తులోనే పలు ఉత్పాతాలు ఖాయమని గత అనుభవాలు స్పష్టంగా చెబుతున్నాయి.
తోకచుక్క కనపడిన మార్గంలో, దాని తోక ఆధారంగా ఎన్ని డిగ్రీలపై అక్షాంశరేఖపై పడిందో, అన్ని డిగ్రీల కోణంలో ఉన్న భూ భాగాల్లో ఆకస్మిక విషాద సంఘటనలు జరుగుతాయి. ఆ ప్రాంతాల్లో ప్రముఖుల మరణం లేదా యుద్దం లేదా ప్రకృతి వినాశనం జరుగుతాయి. కాల ప్రారంభంనుంచి ఈ తోకచుక్క కన్పిస్తూనే ఉంది. తోకచుక్క భూమికి దగ్గరగా వచ్చిన సందర్భాల్లో యుగపురుషులు తమ దేహాలను విడిచిపెట్టారు. ఆయా ప్రాంతాల్లో భీకర యుద్ధాలు జరిగాయి. దీని రాకతో యుగాలు సైతం అంతమైపోయాయి.
భవిష్యత్తు గురించి తెలియజెప్పే శాస్త్రాలు మనకు ఎన్నో ఉన్నాయి. జ్యోతిష్యం, సంఖ్యా శాస్త్రం, వాస్తు ఇలా.... అయితే ఇవన్నీ భవిష్యత్తు గురించి ఇచ్చే వివరాలు ఏ మేరకు సరిగ్గా ఉంటాయనేది ఎన్నో ఆయా వ్యక్తుల జన్మదినం, సమయం, తిథి, నక్షత్రాలు, సూర్యోదయాస్తమయాలపై ఆధారపడి ఉంటాయి. అయితే ఇప్పుడు మనం తోకచుక్కగా పిలిచే ధూమకేతువు కనబడితే మాత్రం అతి సమీప భవిష్యత్తులోనే పలు ఉత్పాతాలు ఖాయమని గత అనుభవాలు స్పష్టంగా చెబుతున్నాయి.
తోకచుక్క
సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తోకచుక్క రెండు తోకల్ని గమనించండి.
తోకచుక్కలు (ఆంగ్లం Comets) ఆకాశంలోని చిన్నచిన్న విచిత్రాలు. నక్షత్రాలను చుక్కలంటాము. తోకచుక్కలు నిజంగా చుక్కలు కావు. తోకచుక్కలు సౌరకుటుంబానికి చెందినవి. సంస్కృతంలో తోకచుక్కలను ధూమకేతువు లంటారు. పూర్వకాలంలో తోకచుక్క కనిపిస్తే ఏదో అరిష్టానికి సూచనగా భావించేవారు.
ఇప్పటికి ఇంచుమించు 600 తోకచుక్కలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటిలో 513 చాలా దీర్ఘకాలికమైనవి.
విషయ సూచిక
తోకచుక్క నిర్మాణం
తోకచుక్క కక్ష్యలో సూర్యునికి దూరాన ఉన్నప్పుడు అతిశీతలంగా ఉంటుంది. దానిలోని వాయువులు గడ్డకడతాయి. అప్పుడు దానికి తలేకాని తోక ఉండదు. తోకచుక్క తలలో మిథేన్, అమ్మోనియా, నీరు గడ్డకట్టి ఉంటాయి. ఈ గడ్డలోపల ఇనుము, నికెల్, కాల్షియం, మెగ్నీషియం, సిలికాన్, సోడియం మొదలగు మూలకాలు ఉంటాయి. సూర్యుని సమీపిస్తున్న కొద్దీ కేంద్రంలోని మంచు కరిగిపోతుంది. వాయువులు విడిపోతాయి. ఈ వాయుకణాల మీద, ఉల్కాధూళి కణాలమీద సూర్యకాంతి పడి ప్రతిఫలిస్తుంది. ఇదే తోకలాగా ప్రకాశిస్తుంది. ఈ వాయువులను సౌరవాయువులు వెనక్కి త్రోసివేస్తాయి. ఈ కారణం వల్లనే ఎప్పుడూ తోకచుక్క తల సూర్యునివైపు, తోక సూర్యునికి వ్యతిరేక దిశలో ఉంటాయి.
ముఖ్యమైన తోకచుక్కలు
హేలీ తోకచుక్క
ఇది 1910 సంవత్సరంలోను, 1985 లోను కనిపించిన తోకచుక్క. ఈ తోకచుక్క 76-77 సంవత్సరాల కొకసారి భూమికి దగ్గరగా వస్తుందని మొదటగా కనిపెట్టినవాడు ఎడ్మండ్ హేలీ అనే ఇంగ్లీషు శాస్త్రజ్ఞుడు. ఆయన పేరు మీదనే దానికి 'హేలీ
తోకచుక్క' అని పేరు పెట్టారు. హేలీ 1659 లో జన్మించాడు. తోకచుక్కలను గురించి ఆయన పరిశోధన చేస్తూ పాత రికార్డులని తిరగ వేస్తుండగా, 1531 లో కనబడిన ఒక ప్రకాశవంతమైన తోకచుక్క, 1607 లో తిరిగి కనబడిందని తెలియవచ్చింది. 1682 లో తాను స్వయంగా చూచిన తోకచుక్క అదేనని కూడా ఆయన కనిపెట్టాడు. అతని లెక్క ప్రకారం ఇది తిరిగి 1759 లో మళ్ళి కనిపించింది. కానీ 1742 లోనే హేలీ కాలధర్మం చెందాడు.
హేలీ తర్వాత ఈ తోకచుక్క చరిత్ర తవ్వి తీయగా వరుసగా 76 సంవత్సరాల కొకసారి దాన్ని ఎవరో ఒకరు చూస్తూనే వున్నరని తెలిసింది. మానవులు చైనా లో మొదటిసారిగా దాన్ని క్రీస్తుపూర్వం 249 లో చూసినట్టుగా నిర్ధారణ అయింది. 1066 లో ఇంగ్లండును నార్మన్ లు జయించినప్పుడు కూడా అదే తోకచుక్క కనబడినట్టు చరిత్రలో ఉన్నది. ఈ హేలీ తోకచుక్కనే 1910 లో గురజాడ అప్పారావు వర్ణించిన "సంఘ సంస్కరణ ప్రయాణ పతాక". ఈ తోకచుక్క గురించి అమెరికన్ రచయిత మార్క్ ట్వేన్ కధనం ప్రసిద్ధమైనది. మహాకవి శ్రీ శ్రీ కూడా 1910 లోనే జన్మించాడు.
మూలాలు
1.అందాల తోకచుక్కలు: విశ్వరూపం: నండూరి రామమోహనరావు, లిఖిత ప్రచురణలు, విజయవాడ, పేజీలు 436-450,
2005.
ఊర్ట్ మబ్బు
ఊర్ట్ మబ్బు , ఒక బంతి ఆకారపు మబ్బు, ఈ మబ్బు తోకచుక్కల నిలయం. ఇది సూర్యుడి నుండి 50,000 ఆస్ట్రనామికల్ యూనిట్ల దూరంలో వున్నది.[1] సూర్యుడినుండి ప్లూటో కు గల దూరం కంటే ఇది 1000 రెట్లు అధికం. దాదాపు ఒక కాంతి సంవత్సరానికి సమానం. ఊర్ట్ మబ్బు యొక్క బాహ్య అంచు మన సౌరమండల అంచునకు ప్రాక్సిమా సెంటారీ (సూర్యునికి అతి దగ్గరలో వున్న నక్షత్రం) దూరానికి పావువంతు విస్తరింపబడి ఉన్నది.
ఈ ఊర్ట్ మబ్బులో రెండు వివిధ భాగాలున్నట్లు భావిస్తున్నారు. ఒకటి, బంతి-ఆకార 'బాహ్య ఊర్ట్ మబ్బు', రెండవది, డిస్క్-ఆకార 'అంతర్ ఊర్ట్ మబ్బు' (లేదా పర్వతాల మబ్బు). ఊర్ట్ మబ్బులో గల శరీరాలు మంచు, ఉదాహరణకు నీరు, అమ్మోనియా మరియు మీథేన్ లతో తయారైన ఆకృతులుగా భావిస్తున్నారు. ఊర్ట్ మబ్బు గురించి సంపూర్ణమైన పరిశోధనలు ఇంకనూ జరగవలసి వున్నవి, అయిననూ ఎక్కువ కాలానికి చెందిన హేలీ తోకచుక్క, బృహస్పతి కుటుంబానికి చెందిన తోకచుక్కలూ మరియు ఇతర తోకచుక్కలకు పుట్టినిల్లు ఈ ఊర్ట్ మబ్బే.[2] తక్కువ కాలానికి చెందిన తోకచుక్కలు క్యూపర్ బెల్ట్ కు చెందినవి.[1], కానీ ఈ తక్కువకాలానికి చెందిన కొన్ని తోకచుక్కలూ ఊర్ట్ మబ్బుకే చెందినవి అని భావిస్తున్నారు. [2] క్యూపర్ బెల్ట్ మరియు సుదూర విసరబడ్డ డిస్క్ ను పరిశీలించి పటాలనూ తయారు చేశారు, కానీ ప్రస్తుతం తెలిసిన శరీరాలు, 90377 సెడ్నా మరియు 2000 CR105 లు అంతర్ ఊర్ట్ మబ్బు సభ్యులని భావించడం జరిగినది.
ఇవీ చూడండి
మూలాలు
1. ↑ Jump
up to: 1.0 1.1 Alessandro Morbidelli
(2008-02-03). "Origin and
dynamical evolution of comets and their reservoirs" (PDF). arxiv.
Retrieved 2007-05-26.
2. ↑ Jump
up to: 2.0 2.1 V. V. Emelyanenko, D. J.
Asher, M. E. Bailey (2007). "The
fundamental role of the Oort cloud in determining the flux of comets through
the planetary system". Royal Astronomical Society. Retrieved
2008-03-21.
బయటి లింకులు
- Oort Cloud Profile by NASA's Solar System
Exploration
- Representation, Southwest Research Institute
- The Kuiper Belt and The Oort Cloud
- The
effect of perturbations by the Alpha Cen A/B system on the Oort Cloud
·
తోకచుక్క అంటే...
·
Sun, 17
Jul 2011, IST vv
·
తోకచుక్కలు నవగ్రహాలు మాదిరిగానే సూర్యునిచుట్టూ ప్రదక్షిణలు చేసే ఖగోళ వస్తువులు. అండ, వృత్తాకార కక్ష్యలో ఇవి తిరుగుతుంటాయి. సూర్యునిచుట్టూ తిరగడానికి కొన్నిటికి దశాబ్దాలు పడితే, మరి కొన్నింటికి అనేక శతాబ్దాలు కూడా పడుతుంది.తోకచుక్కలు తిరిగే కక్ష్యలు బహుదీర్ఘమైన అండవృత్తాలు కాబట్టి సూర్యుని నుంచి వాటి దూరం హెచ్చుగా, తగ్గుతూ ఉంటుంది. సూర్యునికి దూరంగా వెళ్ళినప్పుడు ఇవి ఫ్లూటో కక్ష్యని దాటిపోవచ్చు. దగ్గరగా వచ్చినప్పుడు బుధగ్రహం కన్నా దగ్గరగా రావచ్చు.
·
తోకచుక్క సూర్యునికి బహుదూరంగా ఉన్నప్పుడు కనిపించీ కనిపించనంత చిన్న కాంతిబిందువులాగ ఉంటుంది. అప్పుడు దానికి తోక ఉండదు. తలమాత్రమే ఉంటుంది.ఆ తల భూమి కన్నా పెద్ద సైజులో అనేక వేల మైళ్ళ వ్యాసం కలిగి ఉంటుంది. అందులో రకరకాల సైజులలో రాళ్లూ, రప్పలు, దుమ్ము, ధూళీ వివిధ వాయువులుఉంటాయి. అవి భూమిలాగ దగ్గరగా, దట్టంగా నొక్కుకుని గాక, వదులుగా పలుచగా విస్తరించి ఉంటాయి. దాని మొత్తం బరువులో వెయ్యో వంతు లేక అంతకన్నా తక్కువగా ఉంటుంది. అండ, వృత్త కక్ష్యలో ప్రయాణం చేస్తున్న తోకచుక్క క్రమక్రమంగా సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు సూర్య తేజస్సు తాకిడికి తోకచుక్కలో వదులువదులుగా ఉన్న పదార్థాలు దూరంగా తోసివేయబడి, చిన్నతోకలాగ ఏర్పడుతుంది. బరువైన పెద్దపెద్దరాళ్ళు, కొండలు మాత్రం దూరంగా పోక గుండ్రని తలకాయలాగ ఏర్పడతాయి. సూర్యుడిని సమీపిస్తున్న కొద్దీ దాని తోక అంతకంతకూ పొడవు అవుతూ ఉంటుంది.
·
- కె.వి.వి.శ్రీనివాసరావు
తోకచుక్క ఢీకొనడం వల్ల ఏర్పడిన విలయం
13 వేల ఏళ్ళక్రితం ఉత్తర అమెరికాలో అంతరించి పోయన జాతులు
April
12th, 2010
సుమారు 13వేల సంవత్సరాల క్రితం భూమిని పెద్ద ఎత్తున తోకచుక్కలు ఢీకొనడం వల్ల, గ్రహం చాలా వరకు చల్లబడిపోయిందని, అంతే కాకుండా ఉత్తర అమెరికా ప్రాంతం తీవ్ర విపత్తును ఎదుర్కొన్నదని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఆసమయంలో భూమి ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్షియస్కు తగ్గిపోవడం వల్ల, అప్పుడే మంచుయుగం నుంచి బయటపడుతున్న గ్రహం, తిరిగి చల్లబడి హిమానీ నదాలు మరింతగా వ్యాప్తిచెందాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ‘బ్లాక్ మాట్’ కొన్ని సెంటీమీటర్ల మందాన పేరుకొని వుండటాన్ని వారు గమనించారు. ఈ పొరలో అధిక మొత్తంలో పేరుకొని వున్న పొగ థూళి, అప్పట్లో అడవుల్లో సంభవించిన దావానలాన్ని సూచిస్తున్నాయి. అంతే కాకుండా సూక్ష్మాతి సూక్ష్మమైన నానో డైమండ్స్ను కూడా గుర్తించారు. నిజానికి ఇవి పెద్ద తోకచుక్కలు భూమిని అత్యంత వేగంతో ఢీకొనడం వల్ల సంభవించే షాక్లు లేదా పగుళ్ల కారణంగా ఏర్పడతాయి. ఆనాటి కాలంలో అంతరిక్ష శకలం లేదా తోకచుక్క భూమిపై వున్న లారెంటైడ్ మంచు పొరను ఢీకొన్న కారణంగా భూమిపై ఉత్తర అమెరికా ప్రాంతంలో పెద్ద విపత్తు సంభవించి వుంటుందని శాస్తవ్రేత్తలు అంచనా వేస్తున్నారు. దీని కారణంగా భూమి మరింతగా చల్లబడిపోయి ఇది వేలాది సంవత్సరాలపాటు కొనసాగడం వల్ల, ఉత్తర అమెరికా ప్రాంతానికి చెందిన 35 జాతుల క్షీరదాలు అంతరించి పోయాయని వారు చెబుతున్నారు. అంతే కాకుండా పేలియో ఇండియన్ సంస్కృతికి కూడా చాలా అంతరాయం ఏర్పడిందని చెబుతున్నారు. అయితే ఇక్కడ మరో వాదన కూడా వినిపిస్తోంది, మండుతున్న అంతరిక్ష శకలం ఒకటి అతి వేగంగా భూమిని ఢీకొన్నప్పుడు దావానలం సంభవించి వుండవచ్చునని చెబుతున్నప్పటికీ, అది ఉత్తర అమెరికా ఖండం మొత్తం ఈ అగ్నికీలలువ్యాప్తి చెందడానికి కారణమయ్యేంత సామర్ధ్యం కలిగి వున్నదని చెప్పడానికి ఆధారాలు ఏమీ లేవు. అయితే తాజాగా దీనిపై మరో వాదనను లేవదీశారు. సుమారు 20వేల సంవత్సరాల క్రితం ఒక పెద్ద తోకచుక్క భూవాతావరణంలోకి ప్రవేశించి, క్రమంగా అనేక ముక్కలుగా విడిపోయిందని చెబుతున్నారు. తర్వాత ఇవి భూమిపై ఒక గంటపాటు ధారాపాతంగా పడిపోయాయని చెబుతున్నారు. ఈవిధంగా భూమిని ఢీకొట్టిన తోకచుక్క భాగాలు ఒక్కొక్కటి మెగాటన్ను సామర్ధ్యమున్న అణు బాంబుతో సమానమైన శక్తిని విడుదల చేసాయి. ఫలితంగా విస్తృతంగా అటవీ దావానలం వేగంగా వ్యాపించిందని ఆవాదన వివరిస్తోంది. ఏది ఏమైనా 13వేల సంవత్సరాల క్రితం ఉత్తర అమెరికా ప్రాంతంలో పెద్ద విపత్తు సంభవించడానికి అతిపెద్ద అంతరిక్ష శకలం ఢీకొనడనే కారణమని శాస్తవ్రేత్తలను స్పష్టం చేస్తున్నారు.